![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ 'గాడ్‌ఫాదర్' దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 5న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొని, విజయవంతంగా నడుస్తోంది. అదే రోజు ఆయన ఇంట విజయదశమి వేడుకలు సంబరంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిరంజీవి-సురేఖ దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన దంపతులు, చిరు మాతృమూర్తి అంజనాదేవి, చిరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులు పూజ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
ఇటు విజయదశమి, అటు 'గాడ్‌ఫాదర్' రిలీజ్‌తో మెగాస్టార్ అభిమానులకు రెండు పండగలు ఒకేసారి వచ్చినట్లయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక విడుదలైన చిరు సినిమాల్లో 'గాడ్‌ఫాదర్'కు తక్కువ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఇవాళ రెండో రోజు అనేక థియేటర్లలో మార్నింగ్ షోలు, మ్యాట్నీలు ఫుల్ అయ్యాయనే సమాచారంతో సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకాన్ని నిర్మాతలు, పంపిణీదారులు వ్యక్తం చేస్తున్నారు.
కాగా బుధవారం ఉదయం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో చిరంజీవి, సురేఖ దంపతులు కనకదుర్గ అమ్మవారికి పూజలు చేశారు. ఆ పూజలో అంజనాదేవి, రామ్‌చరణ్ కూడా పాలుపంచుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ఆలస్యం.. విరివిగా వ్యాప్తిలోకి వచ్చాయి.
మరోవైపు 'గాడ్‌ఫాదర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆ సినిమా టీమ్, మెగా ఫ్యాన్స్ మునిగి తేలుతున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, నటుడు సత్యదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు చిరు ఇంటికి వెళ్లి, ఆయనను అభినందించారు. ఆయన కూడా వారికి పండగ శుభాకాంక్షలు తెలిపి, సినిమా విజయం కావడంపై తమ ఆనందాన్ని పంచుకున్నారు.
సినిమాలో మసూమ్ భాయ్‌గా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ సైతం చిరుకు అభినందనలు తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. "మై డియర్ చిరు గారు, ఐ లవ్ యు అండ్ ఐ లవ్ దట్ గాడ్‌ఫాదర్ డూయింగ్ వెల్. కంగ్రాట్స్.. గాడ్ బ్లెస్ యు" అని ఆయన చెప్పారు.

![]() |
![]() |