![]() |
![]() |

ఈమధ్య కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చిన ఉత్తమ చిత్రాలలో 'సీతా రామం' ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల మెప్పు పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది ఈ చిత్రం. సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని చూసి ఫిదా అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
"సీతా రామం చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నా దత్, ప్రియాంకా దత్ లకు, ఒక ప్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా- రామ్ లుగా ఆ ప్రేమకథ కి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు , సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్న కి మొత్తం టీం అందరికీ నా శుభకాంక్షలు!. ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తి గా అభిలషిస్తున్నాను." అని ట్వీట్ చేశారు చిరంజీవి.
![]() |
![]() |