![]() |
![]() |

'కార్తికేయ 2' సినిమాతో నిఖిల్ సిద్ధార్థ దశ తిరిగింది. తెలుగు చిత్రసీమలో ఓ సాధారణ హీరో స్థాయి నుంచి ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవల్ హీరో అయిపోయాడు. మిగతా వారిలాగే ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్.. ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం మామూలుది కాదు. ఇండస్ట్రీలో అతడి కెరీర్ ఒక వెయ్యి నూటపదహారు రూపాయల జీతంతో ప్రారంభమైంది. ఇప్పుడు ఏకంగా 'కార్తికేయ 2' సినిమా అతడిని రూ. 100 కోట్ల క్లబ్‌లో చేర్చింది.
తెలుగు చిత్రసీమలో నిఖిల్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం ప్రారంభించాడు. అతని తొలి జీతం రూ. 1116. నిజానికి అతడిదేమీ పేద కుటుంబం కాదు. సుఖంగా, సౌకర్యంగా బతకడానికి అవకాశం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడే. అయినప్పటికీ సినిమాపై అంటే ఉన్న విపరీతమైన ఇష్టంతో తక్కువ జీతంతోటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అయితే శేఖర్ కమ్ముల సినిమా 'హ్యాపీ డేస్'లో నటుడిగా వచ్చిన వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని రాజేశ్ క్యారెక్టర్‌లో సూపర్బ్‌గా రాణించాడు.
ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో మూస సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా, వైవిధ్యమైన సబ్జెక్టులను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'స్వామి రారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య', 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' లాంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇదివరకు 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి హిట్ కొట్టిన నిఖిల్, తాజాగా 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.
కేవలం వేయి రూపాయల జీతంతో మొదలైన తన ప్రయాణం.. హీరోగా నటించిన సినిమా (కార్తికేయ 2)తో రూ. 100 కోట్ల క్లబ్బులో చేరే దిశగా తన సత్తాను చాటాడు. ఈ విజయం ఒక రాత్రిలో వచ్చినది కాదు, దీని వెనుక ఎన్నో ఏళ్ళ శ్రమ, పట్టుదల ఉన్నాయి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనడానికి నిఖిల్ ప్రయాణం ఒక చక్కటి నిదర్శనం.
![]() |
![]() |