![]() |
![]() |

నిజ జీవిత జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర' చాలా కాలంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు చేసిన ఈ మూవీని అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 'బ్రహ్మాస్త్ర: శివ' సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం: శివ' పేరుతో వస్తోన్న ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' మూవీతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. భీమ్ క్యారెక్టర్‌లో అతని నటన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. బెస్ట్ యాక్టర్‌గా అతనికి ఆస్కార్ నామినేషన్ లభించే అవకాశాలున్నాయని హాలీవుడ్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్రం' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు, తెలుగు వెర్షన్‌కు సమర్పకునిగా వ్యవహరిస్తోన్న యస్.యస్. రాజమౌళి. జక్కన్న అంటే విపరీతమైన అభిమానం చూపించే తారక్, మరో ఆలోచన లేకుండా సరేనన్నాడు.
'బ్రహ్మాస్త్ర' పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, దాని ఇంగ్లీష్ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ ఆ సినిమా ప్రమోషన్స్‌తో దేశమంతా చుడుతూ బిజీగా ఉన్నాడు. మరోవైపు గర్భవతి కావడంతో ఆలియా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది.
![]() |
![]() |