![]() |
![]() |

ఎన్నో అంచనాలతో ఈ నెల 25న విడుదలైన 'లైగర్' దారుణమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు, బజ్ కారణంగా టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం రెండోరోజు నుంచి చతికిలబడింది. అయితే నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుండటం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.62 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. మొదటి రోజు 9.57 కోట్ల షేర్, రెండో రోజు 1.54 కోట్ల షేర్, మూడో రోజు 1 కోటి షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.12.11 కోట్ల షేర్ (20.35 కోట్ల గ్రాస్) సాధించింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.5.36 కోట్ల షేర్(25 కోట్ల బిజినెస్), సీడెడ్ లో రూ.1.72 కోట్ల షేర్(9 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో రూ.5.03 కోట్ల షేర్(28 కోట్ల బిజినెస్) వసూలు చేసింది.
నార్త్ ఇండియా 4.60 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.10 కోట్ల షేర్, ఇతర భాషలు 0.40 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 3.05 కోట్ల షేర్ తో కలిపి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21.26 కోట్ల షేర్(42.50 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు అంచనా. వరల్డ్ వైడ్ గా రూ.88.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. మొదటి రోజు 13.45 కోట్ల షేర్, రెండో రోజు 4.06 కోట్ల షేర్, మూడో రోజు 3.75 షేర్ తో ఇప్పటిదాకా 24 శాతం మాత్రమే రికవర్ చేసింది.
90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన లైగర్.. నష్టాలను తప్పించుకోవాలంటే ఇంకా 68 కోట్లకి పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ అది అసాధ్యమనే చెప్పాలి. ఫుల్ రన్ లో ఇంకో 15 కోట్ల షేర్ రాబట్టినా గొప్పేనన్న అభిప్రాయం వ్యక్తమవవుతోంది. అదే జరిగితే బయ్యర్లకు 50 కోట్లకు పైగా నష్టాలు మిగిలే అవకాశముంది.
![]() |
![]() |