![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్, దిల్ రాజు.. మూవీ టీమ్ ని ప్రశంసించినట్లు తెలుస్తోంది.
'బింబిసార'పై కళ్యాణ్ రామ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఈ ఫ్రాంచైజ్ లో మూడు, నాలుగు భాగాలు తెరకెక్కించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఒక భాగంలో తారక్ కూడా నటించే అవకాశముందని ఇటీవల కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా తారక్, దిల్ రాజు కోసం ఈ మూవీ ప్రత్యేక ప్రివ్యూ వేశారట. ఇద్దరికీ సినిమా బాగా నచ్చడమే కాకుండా, ఖచ్చితంగా హిట్ అవుతుందన్న భరోసా ఇచ్చారట. ముఖ్యంగా తారక్ బాగా ఎగ్జైట్ అయినట్లు సమాచారం. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ఇది తన అన్న కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా మిగిలిపోతుందని సంతోషం వ్యక్తం చేశాడట.

మరి ఆగష్టు 5న విడుదలవుతున్న 'బింబిసార' ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ కి ఎం.ఎం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం.
![]() |
![]() |