Home  »  News  »  అదితిరావ్‌తో ముంబైలో సిద్ధార్థ్‌.. ఫొటోగ్రాఫ‌ర్స్‌కు వార్నింగ్‌

Updated : Jul 20, 2022

 

సిద్ధార్థ్‌, అదితి రావ్ హైద‌రి రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారా? అవున‌నే ప్ర‌చారం జోరుగా న‌డుస్తోంది. ముంబైలో ఓ సెలూన్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ ఆ ఇద్ద‌రూ కెమెరా క‌ళ్ల‌కు దొరికిపోయారు. వాళ్ల‌ను గ‌మ‌నించిన ఫొటోగ్రాఫ‌ర్లు ఫొటోలు తీయ‌డం ప్రారంభించారు. దీంతో సిద్ధార్థ్‌కు చిరాకు వ‌చ్చేసి, త‌న‌ను ఫొటోలు తీయొద్ద‌ని చెప్పాడు. ఇంకోసారి ఫొటో తీస్తే బాగా ఉండ‌ద‌ని కూడా అత‌ను వార్నింగ్ ఇచ్చాడు.

అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేసిన మ‌హాస‌ముద్రం మూవీలో సిద్ధార్థ్‌, అదితిరావ్ క‌లిసి న‌టించారు. ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ సినిమా సెట్స్ మీదే సిద్ధార్థ్‌, అదితి ప్రేమ‌లో ప‌డ్డార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ముంబైలో ఆ ఇద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డంతో, వారి రిలేష‌న్‌షిప్‌పై వ‌దంతులు మొద‌ల‌య్యాయి. ఫొటోగ్రాప‌ర్లు త‌నను ఫాలో అవుతుండ‌టంతో, నేనిక్క‌డి వాడ్ని కాను. ఇక్క‌డి వాళ్ల పిక్చ‌ర్స్ తీసుకోండి. వెళ్లండి, ఈసారి ఇలా డీసెంట్‌గా చెప్ప‌ను. అర్థ‌మైందా? అని చెప్పాడు.

కాగా, ఏప్రిల్ 17న సిద్ధార్థ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హాస‌ముద్రంలోని త‌మ ఇద్ద‌రి స్టిల్‌ను షేర్ చేసిన అదితి రావ్‌, అత‌డిని పిక్సీ బాయ్ అంటూ సంబోధించింది. "Happy birthday my pixie boy. To always chasing dreams and unicorns!Always be magic, mad and full of laughter. Always be you. Thank you for the unending laughter and adventures! You better know how loved you are Mmmmmmmmmmmwah (sic)." అంటూ ఆమె రాసుకొచ్చింది. కాగా, అదితి కానీ, సిద్ధు కానీ ఇంత‌దాకా త‌మ అనుబంధం గురించి బ‌హిరంగంగా ఒక్క మాటా చెప్ప‌లేదు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.