![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 29న విడుదలై ఘోర పరాజయం పాలైంది. బయ్యర్లకు ఈ మూవీ ఏకంగా రూ.80 కోట్ల నష్టం తెచ్చినట్లు టాక్. తండ్రీకొడుకులు చిరు, చరణ్ ల స్టార్ డమ్ ఈ సినిమాకి రూ.50 కోట్ల షేర్ కూడా తీసుకురాలేకపోయింది. ఈ సినిమా మెగా హీరోల కెరీర్ లో పెద్ద మచ్చలా మిగిలిపోయిందంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటపడుతున్న టైంలో 'ఆచార్య' కారణంగా మెగా హీరోలకు మరో ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది.
స్టార్ హీరోల సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లలో డబ్బులు వస్తాయి. 'ఆచార్య' శాటిలైట్ రైట్స్ ను కూడా జెమినీ టీవీ రూ.15 కోట్లకు దక్కించుకుందట. కొంత మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. అయితే ఆచార్య కారణంగా నష్టపోయిన బయ్యర్లు తమ నష్టాలను భర్తీ చేయాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జెమినీ టీవీ నుంచి వచ్చే డబ్బుతో కొంత లాస్ ని కవర్ చేయొచ్చని ఆచార్య మేకర్స్ భావించగా.. జెమినీ ఊహించని ట్విస్ట్ ఇచ్చిందట.

స్టార్ హీరోల సినిమాలు ప్రసారం చేసే సమయంలో బడా బడా కంపెనీలు యాడ్స్ ఇస్తాయి కాబట్టి భారీస్థాయిలోడబ్బు సంపాదిస్తుంటాయి టీవీ ఛానెల్స్. అందుకే అన్నేసి కోట్లు పెట్టి శాటిలైట్ రైట్స్ దక్కించుకుంటాయి. అయితే ఆచార్య కోసం ప్రేక్షకులు అంతగా ఎదురుచూడటం లేదు, కంపెనీలు కూడా భారీగా చెల్లించి యాడ్స్ కోసం ఆసక్తి చూపే పరిస్థితి లేదు. అందుకే కాజల్ పేరుని అడ్డు పెట్టుకొని జెమినీ అదిరిపోయే ప్లాన్ వేసిందట.
'ఆచార్య'లో కాజల్ కూడా నటించిన విషయం తెలిసిందే. కానీ చివరి నిమిషంలో కాజల్ ట్రాక్ మొత్తాన్ని లేపేశారు. అయితే జెమినీ డీల్ కుదుర్చుకునే టైంలో స్టార్ కాస్ట్ లో కాజల్ పేరు కూడా ఉందట. ఇప్పుడు అసలు ఆమె క్యారెక్టరే సినిమాలో లేకపోవడంతో.. మీరు అగ్రిమెంట్ తప్పారంటూ జెమినీ మెలిక పెట్టిందట. కాజల్ లేదు కాబట్టి సినిమాని సగం రేట్ కి అంటే రూ.7.5 కోట్లకు ఇవ్వాలని, లేదంటే డీల్ క్యాన్సిల్ చేసుకొని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తోందట. ఈ ఊహించని దెబ్బతో ఆచార్య మేకర్స్ తలలు పట్టుకుంటున్నారట.
టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా భావించే చిరంజీవి సినిమా విషయంలో ఇలా జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఇంతటి అవమానం ఎప్పుడూ జరిగి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |