![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అంటే సుందరానికీ'. జూన్ 10న విడుదలై పర్లేదు అనే టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్స్ కూడా పర్లేదు అనేలా రాబడుతోంది. నాని గత నాలుగైదు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.4 కోట్లకు పైగా షేర్ రాబట్టగా.. అంటే సుందరానికి మాత్రం 4 కోట్ల లోపు షేర్ తో సరిపెట్టుకుంది. రెండో రోజు కూడా ఇంచమించు అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మాత్రం ఇంకా చాలా దూరంలో ఉంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల బిజినెస్ చేసిన మూవీ.. మొదటి రోజు 3.87 కోట్లు, రెండో రోజు 3.48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో 7.35 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటిదాకా నైజాంలో 3.10 కోట్లు(బిజినెస్ 10 కోట్లు), సీడెడ్ లో 0.75 కోట్లు(బిజినెస్ 4 కోట్లు), ఆంధ్రాలో 3.50 కోట్ల(బిజినెస్ 10 కోట్లు) షేర్ వసూలు చేసింది.
రెండు రోజుల్లో కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 2.50 కోట్లు, ఓవర్సీస్ లో 3.5 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ చేయగా.. మొదటి రోజు 5.82 కోట్లు, రెండో రోజు 4.78 కోట్లతో.. రెండు రోజుల్లో 10.60 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 20 కోట్ల దూరంలో ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో మరో 4-5 కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉండగా.. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే వీక్ డేస్ లో సత్తా చాటాల్సి ఉంది.
![]() |
![]() |