![]() |
![]() |

అనసూయ హవా బుల్లితెరపై బాగా వీస్తోంది. ఎన్నో షోస్ ని హోస్ట్ చేయడమే కాదు మూవీస్ లో లీడ్ రోల్స్ లో కూడా యాక్ట్ చేస్తూ దూసుకుపోతోంది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ పుష్ప లో, రంగస్థలంలో ఎలాంటి బోల్డ్ కేరక్టర్స్ ఐనా అందులో జీవించేస్తుంది. రంగమ్మత్తలా, దాక్షాయణిలా స్పెషల్ రోల్స్ చేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.
ఐతే ఇప్పుడు అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ దర్జా. ఈ మూవీ ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకురాబోతోంది. ఐతే ఈ మూవీకి స్పెషల్ గా విక్టరీ వెంకటేష్ తన సపోర్ట్ ని అందించారు. ఈ మూవీ ట్రైలర్ ని వెంకటేష్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ గురుంచి త్వరలో వెల్లడిస్తాం అంటూ మేకర్స్ అన్నారు. ఇక ఈ మూవీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందింది. సునీల్ ఈ మూవీ ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారు. సలీమ్ మాలిక్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు.
![]() |
![]() |