![]() |
![]() |

బావ మూవీ ఫేమ్ అందాల నటి ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి అందాల పాప అడుగుపెట్టిందని జీవితం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ ఆనంద క్షణాలను పంచుకోవాలని ఆత్రుతతో ఉన్నానని చెప్పి ఆ హ్యాపీ మూమెంట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయి తెలీదు. పాప అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనే ఊహల్లో తేలిపోయాను. ఫైనల్ గా ఇప్పుడు నా చేతుల్లోకి నా పాప వచ్చేసిందంటూ తన సంతోషాన్ని అందరితో పంచుకుంది.
లాస్ట్ ఇయర్ ప్రణీత బెంగుళూర్ కి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మూవీస్ లో యాక్ట్ చేసింది ప్రణీత. నటించింది కొన్ని చిత్రాలే ఐనా తన అందమైన పెద్ద పెద్ద కళ్ళతో తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఇక ఇప్పుడు నెటిజన్స్ అంత కంగ్రాట్స్ అంటూ అన్ని భాషల్లో సందేశాలు పంపిస్తున్నారు.
![]() |
![]() |