![]() |
![]() |

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రధారులుగా లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన 'విక్రమ్' మూవీ బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా కేవలం మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించి, హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఆరు దశాబ్దాల సినిమా కెరీర్‌లో కమల్ ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల సినిమాలు చేశారు. అయినప్పటికీ లోకేశ్ డైరెక్షన్ ఆయనను బాగా ఇంప్రెస్ చేసింది.
'విక్రమ్' బ్లాక్‌బస్టర్ అవగానే లోకేశ్‌ను ఒక కొడుకుగా భావిస్తూ ఓ లెటర్ రాశారు కమల్. ఆ లెటర్‌లో లోకేశ్‌ను కేవలం ప్రశంసలతో ముంచెత్తడమే కాకుండా, అతనికి గొప్ప భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కాగా ఈ రోజు లోకేశ్‌కు కమల్ విలాసవంతమైన లెక్సస్ కారును బహూకరించారు. అతనికి ఆ కారు తాళాలను కమల్ అందజేస్తున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇండియాలో లెక్సస్ కార్ స్టార్టింగ్ ప్రైస్ రూ. 60 లక్షలు. రూ. 2.5 కోట్ల రేంజ్ వరకు అవి ఉన్నాయి. దేశంలోని అత్యంత సౌకర్యవంతమైన కార్లలో లెక్సస్ ఒకటి.
'విక్రమ్' కంటే ముందు సందీప్ కిషన్‌తో 'మానగరమ్', కార్తీతో 'ఖైదీ', విజయ్‌తో 'మాస్టర్' లాంటి ఒక దాన్ని మించిన మరో బ్లాక్‌బస్టర్ తీసి, ఓటమి ఎరుగని డైరెక్టర్‌గా నిలవడమే కాకుండా, ఫిల్మ్‌మేకర్‌గా గొప్ప పేరును కూడా సంపాదించుకున్నాడు లోకేశ్.
![]() |
![]() |