![]() |
![]() |

ఈ మధ్య సినిమాలలో గన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు గన్స్ కాన్సెప్ట్ తోనే ఓ సినిమా రాబోతోంది. అదే 'హ్యాపీ బర్త్ డే'. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రాణా దర్శకుడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
'ఇంటింటికీ గన్ను.. ఎదురులేని ఫన్ను' థీమ్ తో రూపొందుతోన్న 'హ్యాపీ బర్త్ డే' మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో టెన్త్ ఫెయిల్ అయిన మినిస్టర్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తున్నాడు. ఆయన ప్రవేశ పెట్టిన గన్ బిల్లుతో వీధికో గన్స్ షాప్ వెలుస్తుంది. అందరూ మొబైల్స్ పట్టుకున్నట్లు చేతుల్లో గన్స్ పట్టుకొని తిరుగుతారు. 'నో గన్స్.. నో ఎంట్రీ' పేరుతో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో ఏం జరిగిందోనన్న ఆసక్తి కలిగిస్తూ టీజర్ ని కట్ చేశారు. మొత్తానికి లావణ్యతో పాటు మిగతా కీలక పాత్ర ధారులంతా గన్స్ తో దర్శనమిచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాళ భైరవ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా అంటుంటే.. 'హ్యాపీ బర్త్ డే' మూవీ టీమ్ మాత్రం తమది పాన్ తెలుగు ఫిల్మ్ అంటూ ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |