![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం `నీకోసం` (1999)తో దర్శకుడయ్యాడు శ్రీను వైట్ల. ఆపై ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన `వెంకీ` (2004) సంచలన విజయం సాధించింది. అటుపై వచ్చిన `దుబాయ్ శీను` (2007) కూడా అదే బాట పట్టి.. రవితేజ - శ్రీను వైట్లని హ్యాట్రిక్ కాంబోగా నిలిపింది. `వెంకీ` తరహాలోనే వినోదానికే పెద్దపీట వేస్తూ.. `దుబాయ్ శీను`ని కూడా తెరకెక్కించారు వైట్ల. ఇందులో దుబాయ్ వెళ్ళాలని కలలు కనే శీను అనే యువకుడిగా ఎంటర్టైన్ చేశారు రవితేజ. అతనికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, నేహ, సుశాంత్ సింగ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సునీల్, భానుచందర్, సాయాజీ షిండే, రఘుబాబు, కృష్ణభగవాన్, సుప్రీత్, వేణు మాధవ్, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, చిత్రం శ్రీను, ఏవీయస్, మల్లికార్జునరావు, పృథ్వీరాజ్, సురేఖా వాణి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. చింతపల్లి రమణ సమకూర్చిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెలోడీబ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన పాటలకు రామజోగయ్య శాస్త్రి, సాహితి పదరచన చేశారు. పాటల్లో ``కన్యారాశి కలువా`` ఎస్సెట్ గా నిలవగా.. ``శీను శీను``, ``వన్స్ అపాన్``, ``దివాళి హోలి``, ``సుప్పనాతి``, ``కోల్ కోల్`` అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం.. 2007 జూన్ 7న విడుదలై కాసుల వర్షం కురిపించింది. నేటితో ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |