![]() |
![]() |

జూన్ 3న విడుదలైన 'మేజర్', 'విక్రమ్' సినిమాలు రెండూ హిట్ లిస్టులో చేరిపోయాయి. మేజర్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోగా.. విక్రమ్ నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి విజయ కేతనం ఎగరేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన విక్రమ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు 1.96 కోట్లు, రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 2.59 కోట్లు, నాలుగో రోజు 1.35 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో 7.90 కోట్ల షేర్(14.56 కోట్ల గ్రాస్)తో సత్తా చాటిన విక్రమ్ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి లాభాల బాట పట్టింది.
తెలుగులో ఈ ఏడాది(2022) ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో ఏడో క్లీన్ హిట్ గా విక్రమ్ నిలిచింది. 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'కాలేజ్ డాన్', 'మేజర్', 'విక్రమ్' మాత్రమే ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ అందుకొని క్లీన్ హిట్స్ గా నిలిచాయి.
'విక్రమ్' సినిమాకి వరల్డ్ వైడ్ గానూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 188.51 కోట్ల గ్రాస్ రాబట్టిన విక్రమ్.. నేడో రేపో 200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.
![]() |
![]() |