![]() |
![]() |

జీ 5 సంస్థ రోజురోజుకు దాని స్థాయిని పెంచుకుంటోంది. ప్రేక్షకుల కోసం సెన్సేషనల్ మూవీస్, ఒరిజినల్ వెబ్ సిరీస్ తో వస్తున్న మూవీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. తాజాగా జీ 5 చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన 'కిన్నెరసాని' మూవీ రైట్స్ ని సొంతం చేసుకుని జూన్ 10న డైరెక్టుగా ఓటిటిలో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యింది. ఇదొక థ్రిల్లర్ మూవీ. తండ్రిని వెతికే పనిలో ఉన్న వేద అనే అమ్మాయి చుట్టూ అల్లుకున్న ఈ స్టోరీలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నాయి.
అన్ శీతల్, కాశీష్ ఖాన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. రవీంద్ర విజయ్ ఈ మూవీలో విలన్‌గా నటించారు. మహతి భిక్షు ఒక కీ రోల్ ప్లే చేశారు. ఈ థ్రిల్లర్ మూవీని రమణ తేజ చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి కథను సాయి తేజ దేహరాజ్ అందించారు. ఈ 'కిన్నెరసాని' మూవీ 'సూపర్ మచ్చి' చిత్రాని కంటే ముందే రెడీ ఐపోయింది. థియేటర్స్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ కుదరకపోయేసరికి ఇక ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారట. మరి ఈ మూవీ ఎలా ఉండబోతోంది ఆ థ్రిల్లర్ సీన్స్ ఎంత అలరించబోతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.
![]() |
![]() |