![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
అడివి శేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన 'క్షణం' సినిమా సమయంలో మూవీ టీమ్ ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని శేష్ ఇప్పటికీ చెబుతుంటాడు. తాజాగా 'మేజర్' టీమ్ ని కూడా ప్రశంసిస్తూ బన్నీ ట్వీట్ చేశాడు. "మేజర్ టీమ్ కి శుభాకాంక్షలు. అడివి శేష్ మరోసారి మ్యాజిక్ చేశాడు. డైరెక్టర్ శశికిరణ్ అద్భుతమైన పని తీరు కనబర్చారు. ప్రేక్షకులకు ఇంత మంచి సినిమా అందించిన నిర్మాత మహేష్ బాబు గారికి ప్రత్యేక అభినందనలు. ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిలించే కథ మేజర్" అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

బన్నీ ట్వీట్ పై మహేష్ స్పందించాడు. థాంక్యూ చెబుతూ రిప్లై ఇచ్చాడు. మీకు సినిమా నచ్చిందని తెలియడం సంతోషంగా ఉందని, మీ మాటలు యంగ్ టీమ్ కి ప్రోత్సాహం కలిగిస్తాయని మహేష్ అన్నాడు.

![]() |
![]() |