![]() |
![]() |

సన్నీలియోన్ పేరు వినగానే చాలు చాలామందికి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆమె పోర్న్ స్టార్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత హీరోయిన్ గా మూవీస్ లో యాక్ట్ చేయడం మొదలు పెట్టింది. 'జిస్మ్' మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ. తెలుగులో వచ్చిన 'కరెంటు తీగ' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రేక్షకులకు దగ్గరయింది. రీసెంట్ గా 'అనామిక' అనే వెబ్ సిరీస్ లో కనిపించి అందరినీ అలరించింది కూడా.
ఇక ఇప్పుడు 'సన్నీ ఏం తింటుంది అంత స్మార్ట్ గా ఉంటుంది' అనే విషయాల గురుంచి చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారని కాబట్టి ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోంది సన్నీ. ఓన్లీ శాకాహారం మాత్రమే తింటుందట. నాన్ వెజ్ అలవాటు ఉన్నా కూడా దాన్ని తినడం మానేసిందట. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటే మంచి ఎనర్జీ వస్తుందని చెప్తోంది. వన్ కప్ ఆఫ్ కాఫీ, స్టఫ్ఫ్డ్ వెజిటబుల్స్ ని ఒక కప్ తింటుందట.ఫ్రూట్స్ ని రేగులర్గా డైట్ లో తప్పనిసరిగా ఉంచుకుంటుంది సన్నీ. ఆపిల్, ద్రాక్షపళ్ళు , జామ, పియర్ ఫ్రూట్, చీకు అనేవి చాలా ఇష్టమట. ఫ్రూట్స్ తినడం వల్ల బాడీ ఎప్పుడూ యంగ్ గా కనిపిస్తుందని చెప్తోంది సన్నీ.
ఫేవరెట్ స్నాక్ ఏది అంటే చాలు పాప్ కార్న్ అంటుంది సన్నీ. ఇంకా ఆలూ పరాటా మీద చీజ్ వేసుకుని ఎంజాయ్ చేస్తూ లాగించేస్తుందట. మెక్సికన్ డిషెస్ ని ఎక్కువ ఇష్టపడతానని చెప్తోంది. జంక్ ఫుడ్ ఎక్కువగా లాగించేసిన మంచి వర్కౌట్స్ చేసి బాడీని స్లిమ్ చేసేస్తా అంటోంది. కేక్స్, పేస్ట్రీస్ అన్నీ ఎలాంటి రూల్స్ లేకుండా లాగిస్తుందట. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్ అంటోంది. అన్నిటికన్నా ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బాడీ షైన్ అవుతుందని చెప్తోంది క్యూట్ సన్నీ.
![]() |
![]() |