![]() |
![]() |

ఇటీవల ఓటీటీలో పే పర్ వ్యూ ట్రెండ్ నడుస్తోంది. సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలకు ఓటీటీ సంస్థలు అదనంగా ఛార్జ్ వసూలు చేస్తున్నాయి. ఇటీవల 'కేజీఎఫ్-2' ఓటీటీలో అలాగే అందుబాటులోకి వచ్చింది. 'ఆర్ఆర్ఆర్'ని కూడా మొదట ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఆడియన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన భారీ సినిమాల విషయంలోనే పే పర్ వ్యూ విధానాన్ని ఆడియన్స్ వ్యతిరేకిస్తుంటే.. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ డిజాస్టర్ మూవీని పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషించిన రీసెంట్ మూవీ 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై దారుణ ఫలితాన్ని చూసింది. దారుమైన కలెక్షన్స్ తో ట్రోల్ స్టఫ్ గా మారింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో విడుదల కాగా అక్కడ కూడా అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వస్తోంది. పైగా ఈ సినిమాని యూఎస్ లో పే పర్ వ్యూ విధానంలో అందుబాటులోకి తీసుకురావడం ఆశ్చర్యకరంగా మారింది. సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ యూఎస్ లో ఈ సినిమా చూడాలంటే అద్దె అయితే 2.99 డాలర్లు, కొనడమైతే 9.99 డాలర్లు చెల్లించాల్సి ఉంది.
.webp)
బ్లాక్ బస్టర్స్ సినిమాలకే అదనంగా చెల్లించి చూడటంపై ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదంటే.. డిజాస్టర్ సినిమాకి పే పర్ వ్యూ విధానం పెట్టడం ఏంటంటూ అమెజాన్ ప్రైమ్ ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
![]() |
![]() |