![]() |
![]() |

ఏ చిన్న సెన్సిటివ్ ఇష్యూ దొరికినా చాలు అది ఓటిటి ప్లాట్ఫారం పై మంచి కథా, కథనంతో వెబ్ సీరీస్ గా రూపొందుతోంది. ఓటిటి పుణ్యమా అని సిల్వర్ స్క్రీన్ పై చూడలేని ఎన్నో మూవీస్ ని ఈ ప్లాట్ఫారం పై ప్రతీ ఒక్కరు చూడగలుగుతున్నారు. ఇలాంటి వెబ్ సిరీస్ లకు మంచి ఫాలోయింగ్ కూడా వస్తోంది. అందుకే టాప్ డైరెక్టర్స్ కూడా దీని వైపు మొగ్గు చూపిస్తున్నారు. లేటెస్ట్ గా డైరెక్టర్ క్రిష్ ఒక స్టోరీని వెబ్ సిరీస్ గా తీశారు. ఇప్పుడది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఒక న్యూ కంటెంట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఆ మూవీ పేరే "9 అవర్స్''.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుశాలిని, రవి వర్మ, ప్రీతీ అస్రాని వంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు. అసలు ఈ స్టోరీ లైన్ చూస్తే జైలులో శిక్ష అనుభవించే ముగ్గురు ఖైదీలు ఒక బ్యాంకులో భారీ దొంగతనం చేయడం కోసం ఒక పెద్ద స్కెచ్ వేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఫైనల్ గా బ్యాంకులోకి ఎలా ఎంటరవుతారు ? వాళ్ళు వేసిన స్కెచ్ ఎంత వరకు సక్సెస్ అయ్యింది ? ఈ మిడిల్ డ్రాప్ లో వాళ్లకు ఎదురైనా సంఘటనలు ఏమిటి ? చివరికి పోలీసులు ఏం చేశారు ? అనే విషయాలతో ఒక సస్పెన్స్ డ్రామాను ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 2 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
![]() |
![]() |