![]() |
![]() |

ఆగస్టు నెల అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఆ నెల 29వ తేది కింగ్ నాగార్జున పుట్టినరోజు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది నాగ్ బర్త్ డే మంత్ ఆగస్టు.. అక్కినేని ఫ్యాన్స్ కి మరింత స్పెషల్ కానుంది. ఆ కాంపౌండ్ కి చెందిన ముగ్గురు కథానాయకులు కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు సినిమాలతో పలకరించనుండడమే ఇందుకు కారణం.
ఆ వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సీతా రామం`. పిరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీ ఆగస్టు 5న జనం ముందుకు రానుంది. కాగా, ఇందులో నాగ్ మేనల్లుడు సుమంత్ ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇక `సీతా రామం` విడుదలైన తదుపరి వారంలో అంటే ఆగస్టు 11న నాగార్జున పెద్ద కొడుకు, యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా` రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో తెరపైకి వచ్చే అవకాశముంది. అలాగే, ఆగస్టు 12న నాగ్ చిన్న కొడుకు అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ లో నటిస్తున్న `ఏజెంట్` విడుదల కానుంది. మరి.. ఎనిమిది రోజుల్లో రాబోతున్న ఈ మూడు చిత్రాలు.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
![]() |
![]() |