![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బాక్సాఫీస్ దగ్గర అడ్డనేది లేకుండా దూసుకుపోతూ పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం 'కేజీఎఫ్ 2' ప్రపంచవ్యాప్తంగా 39 రోజుల్లో రూ. 1221.13 కోట్లను వసూలు చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రధారులు.
'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజైన రెండు వారాలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేజీఎఫ్ 2'.. ఆ సినిమాని మించి వసూళ్లను రాబడుతుండటం విశేషం. 'కేజీఎఫ్ 2'తో పాటే విడుదలైన విజయ్ 'బీస్ట్' మూవీ దాని ధాటి ముందు నిలబడలేకపోయింది.
ట్రేడ్ వర్గాల ప్రకారం మొదటి ఐదు వారాల్లో రూ. 1210.53 కోట్లను వసూలు చేసిన 'కేజీఎఫ్ 2' ఆరో వారంలో 37వ రోజు రూ. 3.10 కోట్లు, 38వ రోజు రూ. 3.48 కోట్లు, 39వ రోజు రూ. 4.02 కోట్లను వసూలు చేసింది. వెరసి ఈ సినిమా వసూళ్లు రూ. 1221.13 కోట్లకు చేరుకున్నాయి. కొత్త సినిమాలు వస్తున్నా, ఓటీటీలో ఎన్నో చాయిస్‌లు అందుబాటులో ఉన్నా జనం ఇప్పటికీ ఈ సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపుతున్నారు.
![]() |
![]() |