![]() |
![]() |

బాక్సాఫీస్ దగ్గర 'సర్కారు వారి పాట' జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా.. నిన్న ఆదివారం కావడంతో వరల్డ్ వైడ్ గా మూడు కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అయినప్పటికీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం మాత్రం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 11వ రోజు 'సర్కారు వారి పాట' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 2.40 కోట్ల షేర్ రాబట్టింది. 7 రోజు నుంచి 2 కోట్ల లోపు షేర్ రాబట్టిన మూవీ ఆదివారం కావడంతో 11వ రోజు 2 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో 86.07 కోట్ల షేర్(129.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ లో 97.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 88 శాతం రికవరీ సాధించింది. 11 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 32.21 కోట్ల షేర్(36 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 11.07 కోట్ల షేర్(13 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 42.79 కోట్ల షేర్(48.50 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా 11వ రోజు 3.06 కోట్ల షేర్ వసూలు చేసిన 'సర్కారు వారి పాట' ఇప్పటిదాకా 104.68 కోట్ల షేర్(167.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్ గా 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 16 కోట్ల దూరంలో ఉంది. మే 27న 'F3' సినిమా విడుదల ఉండటంతో వచ్చే వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 'సర్కారు వారి పాట' కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపి, బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమవుతుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటిన సర్కారు వారి పాట.. బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా అందుకొని సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |