![]() |
![]() |

నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో కలెక్షన్ల తుఫాను సృష్టించిన 'సర్కారు వారి పాట' ఐదో రోజు సోమవారం కావడంతో కాస్త దూకుడు తగ్గించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్-2' ఐదో రోజు(సోమవారం) రూ.5.10 కోట్ల షేర్ రాబట్టగా.. సర్కారు వారి పాట రూ.3.64 కోట్ల షేర్ వసూలు చేసింది. 'కేజీఎఫ్-2'తో పోల్చితే తక్కువే అయినప్పటికీ.. డివైడ్ టాక్ తో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం విశేషమనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొదటి రోజు 36.01 కోట్ల షేర్ రాబట్టిన సర్కారు వారి పాట.. రెండో రోజు 11.04 కోట్లు, మూడో రోజు 12.01 కోట్లు, నాలుగో రోజు 12.06 కోట్లు, ఐదో రోజు 3.64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 96.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన మూవీ.. ఇప్పటిదాకా 74.76 కోట్ల షేర్ రాబట్టి 77.47 శాతం రికవరీ సాధించింది. ఐదు రోజుల్లో నైజాంలో 28.67 కోట్ల షేర్(36 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 9.34 కోట్ల షేర్(13 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 36.75 కోట్ల షేర్(47.50 కోట్ల బిజినెస్) వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 120 కోట్ల బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. ఐదు రోజుల్లో 91.37 కోట్ల షేర్ రాబట్టి వంద కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 76 శాతానికి పైగా రికవరీ సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 29 కోట్ల దూరంలో ఉంది. ఐదు రోజుల్లో కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 5.40 కోట్ల షేర్(11.50 కోట్ల బిజినెస్) రాబట్టగా.. ఓవర్సీస్ లో 11.20 కోట్ల షేర్(11 కోట్ల బిజినెస్) తో సత్తా చాటింది. మహేష్ అడ్డాగా చెప్పుకునే ఓవర్సీస్ లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
![]() |
![]() |