![]() |
![]() |

సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో 'జయంత్'ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా 'నెల్సన్'. జయంత్ కార్తీక్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది. ఉత్కంఠభరిత కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.
త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. అందులో హీరో లుక్ స్టైలిష్ గా ఆకట్టుకునేలా ఉంది.

ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, 'పుష్ప' ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా శివ దేవరకొండ, ఎడిటర్ గా ఎమ్.ఆర్.వర్మ వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కథ-మాటలు-స్క్రీన్ ప్లే సాయి సునీల్ నిమ్మల అందిస్తున్నారు.
![]() |
![]() |