![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20 నుంచి 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అదే రోజున తారక్ తదుపరి సినిమాలు NTR30, NTR31 అప్డేట్స్ కూడా వస్తుండటంతో ట్రిపుల్ బొనాంజా అంటూ తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఆ రోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కూడా డబుల్ ట్రీట్ కానుంది.
'ఆర్ఆర్ఆర్'లో తారక్ తో పాటు రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు చరణ్. రామరాజుని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ మే 20న ఓటీటీలో విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అదేరోజు చరణ్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో సందడి చేయనుండటం విశేషం.

చిరంజీవితో కలిసి చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. భారీ అంచనాలతో ఏప్రిల్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ దారుణ ఫలితాన్ని చూసి, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో చరణ్ పోషించిన సిద్ధ పాత్ర ఫ్యాన్స్ ని మెప్పించింది. ఓటీటీ వేదికగా ఒకేరోజు రామరాజుని, సిద్ధని చూసే అవకాశం ఫ్యాన్స్ కి దక్కనుంది.
![]() |
![]() |