![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికీ కొన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.
'ఆర్ఆర్ఆర్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నాయి. సౌత్ భాషలు రైట్స్ జీ5 దక్కించుకోగా.. హిందీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. మే 20 నుంచి 'ఆర్ఆర్ఆర్' మూవీ స్ట్రీమింగ్ కానుందని ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి 'జీ5'లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 'ఆర్ఆర్ఆర్' మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే హిందీ స్ట్రీమింగ్ పై ఇంకా క్లారిటీ రాలేదు.
మే 20న తారక్ పుట్టినరోజు. అదే రోజు నుంచి 'ఆర్ఆర్ఆర్' స్ట్రీమింగ్ కావడం తారక్ ఫ్యాన్స్ కి బిగ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు. అలాగే ఆరోజు తారక్ తదుపరి సినిమాల అప్డేట్స్ కూడా రానున్నాయి. NTR30 టైటిల్ రివీల్ తో పాటు.. NTR31 అధికారిక ప్రకటన రానుంది.
![]() |
![]() |