![]() |
![]() |

2022 మేని టార్గెట్ చేసుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ ముంగిట కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. కాగా, పరాజయాల్లో ఉన్న కొంతమంది కథానాయికలకి.. సదరు సినిమాల ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. మే బాక్సాఫీస్ పరంగా ఆశల పల్లకిలో ఉన్న ఆ అందాల తారల వివరాల్లోకి వెళితే..
కేథరిన్ ట్రెసా: గత చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్` (2020) డిజాస్టర్ కావడంతో.. ఈ నెల 6న విడుదలకు సిద్ధమైన `భళా తందనాన`పైనే ఆశలు పెట్టుకుంది కేథరిన్ ట్రెసా. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుంది కేథరిన్.
కీర్తి సురేశ్: బ్లాక్ బస్టర్ మూవీ `మహానటి` (2018) తరువాత తెలుగులో కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 12న రానున్న `సర్కారు వారి పాట`పైనే ఆశలు పెట్టుకుంది కీర్తి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కళావతిగా కనువిందు చేయనుందీ కేరళకుట్టి.
తమన్నా, పూజా హెగ్డే, మెహ్రీన్, సోనాల్ చౌహాన్: ఈ నెల 27న రిలీజ్ కానున్న `ఎఫ్ 3`పై ఏకంగా నలుగురు అందాల తారలు ఆశలు పెట్టుకున్నారు. ఆ భామలే.. తమన్నా, పూజా హెగ్డే, మెహ్రీన్, సోనాల్ చౌహాన్. గత చిత్రం `మాస్ట్రో` (2021) నిరాశపరచడంతో తమన్నాకి `ఎఫ్ 3` విజయం కీలకం కాగా.. `చాణక్య`(2019), `ఎంత మంచివాడవురా`(2020), `అశ్వథ్థామ` (2020), `మంచి రోజులు వచ్చాయి` (2021) వంటి వరుస పరాజయాల్లో ఉన్న మెహ్రీన్ కి అంత కంటే ముఖ్యం. ఇక ఇందులో స్పెషల్ రోల్ చేసిన సోనాల్ కి 2014లో రిలీజైన `లెజెండ్`నే చివరి హిట్ కాగా.. ఇదే సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన పూజా హెగ్డే అయితే రీసెంట్ గా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ని చవి చూసింది.
మరి.. ఆశల పల్లకిలో ఉన్న ఈ అందాల తారలకి మే బాక్సాఫీస్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |