![]() |
![]() |

2022 క్యాలెండర్ ఇయర్ లో తెలుగునాట పలు సీక్వెల్ మూవీస్ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రిలీజైన `సోగ్గాడే చిన్ని నాయనా` (2016) సీక్వెల్ `బంగార్రాజు` చెప్పుకోదగ్గ విజయం సాధించగా.. అనువాద చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 1' (2018)కి కొనసాగింపు అయిన `కేజీఎఫ్: చాప్టర్ 2` ఏప్రిల్ 14న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 27న 'ఎఫ్ 2' (2019) సీక్వెల్ `ఎఫ్ 3` వినోదాలు పంచేందుకు సిద్దమవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది జూలై లో బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తెలుగు తెరపై ఎంటర్టైన్ చేయబోతున్నాయి. వారం వ్యవధిలో రాబోతున్న ఆ చిత్రాలే.. `కార్తికేయ 2`, `హిట్: ద సెకండ్ కేస్`. ఆ వివరాల్లోకి వెళితే.. 2014 నాటి సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ `కార్తికేయ`కి కొనసాగింపుగా రాబోతున్న `కార్తికేయ 2` మూవీ.. జూలై 22న విడుదల కాబోతోంది. `కార్తికేయ`లో హీరోగా నటించిన నిఖిల్ ఇందులోనూ కథానాయకుడు కాగా.. చందు మొండిటినే దర్శకుడిగా కొనసాగుతున్నాడు.
ఇక `కార్తికేయ 2` విడుదలైన వారం తరువాత అంటే జూలై 29న `హిట్: ద సెకండ్ కేస్` రాబోతోంది. 2020 నాటి `హిట్: ద ఫస్ట్ కేస్`కి కొనసాగింపుగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తయారైంది. `హిట్` ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ హీరో కాగా.. సెకండ్ పార్ట్ లో అడివి శేష్ కథానాయకుడు. రెండింటికీ శైలేష్ కొలనునే దర్శకుడు. మరి.. రెండు వరుస వారాల్లో వస్తున్న ఈ సీక్వెల్స్ విజయపథంలో పయనిస్తాయేమో చూడాలి.
![]() |
![]() |