![]() |
![]() |
.webp)
సినిమాలలో పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సీన్స్ కూడా కొన్ని ఎడిటింగ్ లో పోతుంటాయి. అయితే పూర్తిగా వాళ్ళు పోషించిన రోల్ నే ఎడిటింగ్ లో తీసేయడం చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా 'ఆచార్య' సినిమా విషయంలో అదే జరిగింది. ఈ సినిమాలో కాజల్ రోల్ ని పూర్తిగా లేపేశారు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాడు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడీగా పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమా నుంచి కాజల్ సీక్వెన్స్ మొత్తాన్ని డిలీట్ చేశారని, అందుకే ఆమె ట్రైలర్ లో కనిపించలేదని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ కొరటాల షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల మాట్లాడుతూ కాజల్ రోల్ ని తీసేశామని అంగీకరించారు. " ఆచార్యలో కాజల్ కి చాలా ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేశాను. ఆమె పాత్రకి సంబంధించి 3-4 రోజులు షూట్ కూడా చేశాం. కానీ రషెస్ చూశాక సినిమా వెళ్తున్న ఫ్లోకి ఆ పాత్ర ఫిట్ అవ్వట్లేదు అనిపించింది. అందుకే ఆమె పాత్రని ట్రిమ్ చేయాలనుకున్నాం. ఈ విషయాన్ని కాజల్ కి చెప్తే ఆమె నా పరిస్థితి అర్థం చేసుకొని పాజిటివ్ గా స్పందించింది. అయితే కాజల్ 'లాహే లాహే' సాంగ్ లో కనిపిస్తుంది. ఆ సాంగ్ లో ఆమె ఎలా ఫిట్ అయిందో సినిమా చూస్తే తెలుస్తుంది." అని కొరటాల చెప్పుకొచ్చారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మెగా మూవీ ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |