![]() |
![]() |

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తన కెరీర్ ఆరంభంలో కొన్ని ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ రూపొందించారు. వాటిలో `కల్పన` ఒకటి. 1973 నాటి హిందీ చిత్రం `అనామిక` (జయ బాధురి, సంజీవ్ కుమార్) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాలో కల్పనగా టైటిల్ రోల్ లో ఆకట్టుకున్నారు జయచిత్ర. మురళీ మోహన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గిరిబాబు, జయమాలిని, భానుప్రకాశ్, నూతన్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకోగా.. ప్రభాకర రెడ్డి, గోపాల రావు, ఛాయాదేవి అతిథి వేషాల్లో దర్శనమిచ్చారు.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, గోపి, వీటూరి సాహిత్యమందించారు. పాటల్లో ``దిక్కులు చూడకు రామయ్యా``, ``ఒక ఉదయంలో నా హృదయంలో`` ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలవగా.. ``వదలనురా నిన్ను రఘురామా``, ``అద్దరాతిరి పొద్దు పొడిచినా``, ``పొద్దు వాలిపోయాక.. ఊరు సద్దు మణిగాక`` గీతాలు కూడా అలరించాయి. క్రాంతి కుమార్ నిర్మించిన `కల్పన`.. 1977 ఏప్రిల్ 22న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |