![]() |
![]() |

శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భళా తందనాన'. వారాహి చలన చిత్రం బ్యానర్ నిర్మించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అయితే కరోనా కారణంగా విడుదల ఆలస్యమైన ఈ సినిమాని ఇప్పుడేకంగా 'ఆచార్య'కు పోటీగా విడుదల చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29 విడుదల కానుంది. ఈ మెగా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా విష్ణు మూవీ విడుదల కావడం హాట్ టాపిక్ గా మారింది. 'భళా తందనాన' సినిమాని ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరి ఆచార్య విడుదలైన మరుసటిరోజు విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. మరో విశేషం ఏంటంటే ఆచార్య, భళా తందనాన రెండు సినిమాలకు మణిశర్మే సంగీతం అందించారు.

విభిన్న చిత్రాలతో శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బాణం', 'బసంతి' వంటి సినిమాలతో దర్శకుడిగా చైతన్య దంతులూరి ఆకట్టుకున్నాడు. వీరిద్దరిలో కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'భళా తందనాన'పై సినీ ప్రేమికుల్లో ఆసక్తి ఉంది. దానికి తోడు ఈ సినిమాలో 'కేజీఎఫ్'లో గరుడగా నటించి మెప్పించిన రామ్ చంద్ర విలన్ గా నటించడం విశేషం.
![]() |
![]() |