![]() |
![]() |

ఏప్రిల్ 14 న విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్-2' వారంరోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎనిమిదో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వరల్డ్ వైడ్ గా 8వ రోజు 31.05 కోట్ల గ్రాస్ రాబట్టి 750 కోట్ల క్లబ్ లో చేరింది. 'పీకే' మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ 741 కోట్లని ఎనిమిది రోజుల్లో క్రాస్ చేసి.. 750.35 కోట్లతో ఇండియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాల్లో ఆరో స్థానంలో నిలిచింది. త్వరలోనే 'సీక్రెట్ సూపర్ స్టార్(831 కోట్లు)', 'భజరంగీ భాయీజాన్(870 కోట్లు)' సినిమాలను నాలుగో స్థానంలోకి వచ్చే అవకాశముంది. మొదటి మూడు స్థానాల్లో 1958 కోట్లతో 'దంగల్', 1810 కోట్లతో 'బాహుబలి-2', 1097 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' ఉన్నాయి. ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ ని బీట్ చేస్తుందో లేదో చూడాలి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు 1.50 కోట్ల షేర్ రాబట్టిన కేజీఎఫ్-2 ఎనిమిది రోజుల్లో 66.01 కోట్ల షేర్(105.05 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇప్పటిదాకా ఈ సినిమా తెలంగాణలో 34.22 కోట్లు, ఆంధ్రాలో 22.52 కోట్లు, రాయలసీమలో 9.27 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 8 రోజుల్లో 372.06 కోట్ల షేర్(750.35 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఎనిమిది రోజుల్లో కర్ణాటకలో 69.05 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 66.01 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 24.80 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 19.65 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 134.75 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 57.80 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే మిగతా చోట్లా ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
![]() |
![]() |