![]() |
![]() |

చెన్నై పొన్ను సమంత, కన్నడ కస్తూరి రష్మికా మందన్న.. ఒకే బాటలో పయనిస్తున్నారా? అవునన్నదే టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `మహానటి` తరువాత యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తోంది సామ్. `నిన్ను కోరి`, `మజిలీ` చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత కశ్మీరీ యువతిగా కనిపించబోతున్నట్లు సమాచారం. మరోవైపు.. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ జంటగా `అందాల రాక్షసి`, `కృష్ణగాడి వీరప్రేమగాథ`, `లై`, `పడి పడి లేచె మనసు` చిత్రాల సృష్టికర్త హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `సీతారామం`లోనూ రష్మిక అదే తరహా పాత్రలో కనిపించబోతోంది. ఇందులో అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం యువతిగా అభినయానికి ఆస్కారమున్న వేషంలో దర్శనమివ్వనుంది రష్మిక.
మరి.. కశ్మీరీ యువతుల పాత్రల్లో తొలిసారిగా నటిస్తున్న సమంత, రష్మిక.. ఆయా సినిమాల్లో ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి. కాగా, ఈ రెండు సినిమాలు కూడా ఇదే ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |