![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న థియేటర్స్ లో విడుదల కానుంది. చిరు, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్లిద్దరినీ స్క్రీన్ పై చూడటం మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ ఉందని తెలుస్తోంది. 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ 23న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి పవన్ గెస్ట్ గా రానున్నాడని న్యూస్ వినిపిస్తోంది. అదే నిజమైతే ముగ్గురు మెగా హీరోలను ఒకే వేదికపై చూసుకోవడం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల తగ్గింపు వివాదం సమయంలో మెగా ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడ్డారు. ఓ వైపు పవన్ ఏపీ ప్రభుత్వంపై యుద్ధానికి దిగితే, మరోవైపు చిరంజీవి మాత్రం సీఎం జగన్ ని కలిసి ఇండస్ట్రీకి అండగా నిలబడాలంటూ చేతులు జోడించి కోరారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం ఏర్పడింది. చిరు, పవన్ మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు చిరు, పవన్ ఒకే వేదికపై సందడి చేస్తే.. ఆ వార్తలకు చెక్ పెట్టడమే కాకుండా మెగా ఫ్యాన్స్ ఖుషీ చేసినట్లు అవుతుంది.
![]() |
![]() |