![]() |
![]() |

మహేశ్‌బాబు ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ-ట్రాన్‌ను కొనుగోలు చేశాడు. దాని విలువ రూ. 1.19 కోట్లు. ఈ కారును కొనడం ద్వారా ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై బలమైన మెసేజ్ పంపాడు మహేశ్. మహేశ్ తన కొత్తకారుతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రస్తుతం అతను 'సర్కారు వారి పాట' షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ మే 12న విడుదలవుతోంది. 2020 సంక్రాంతికి వచ్చిన మునుపటి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. ఆ తర్వాత ఓ రెండు నెలలు రెస్ట్ తీసుకొన్నాడు. ఆ తర్వాత కొవిడ్ టైమ్‌లో తన ఫ్యామిలీతో గడుపుతూ వచ్చాడు.
రీసెంట్‌గా అతను రూ. 1.19 కోట్ల ఖరీదు చేసే ఎలక్ట్రిక్ కారును కొన్నాడు. అతని గ్యారేజ్‌లో మరో లగ్జరీ యస్‌యువీ కారు ఆడి ఇ-ట్రాన్ చేరింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, "Bringing a clean, green and sustainable future home. Excited for the #Audi Experience (sic)." అని పోస్ట్ చేశాడు. ఈ కారుకు వెనుకవైపు ఎల్ఈడీ స్ట్రిప్స్‌తో ఉన్న గ్రాఫిక్ గ్రే డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కారులో 3డి సరౌండ్ సౌండ్‌తో ఆడియో సిస్టమ్ కూడా ఉంది.
పరశురామ్ పేట్ల డైరెక్ట్ చేస్తోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించి ఒక సాంగ్ మినహా మిగతా షూటింగ్ పూర్తయింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ స్వరాలు కూర్చిన 'కళావతి', 'పెన్నీ' సాంగ్స్ ఇప్పటికే సూపర్ పాపులర్ అయ్యాయి. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ వెంటనే రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.
![]() |
![]() |