![]() |
![]() |

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల షేర్ మార్క్ ని దాటి సత్తా చాటిన 'కేజీఎఫ్ చాప్టర్-2' మరో సంచలన రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ రాబట్టిన డబ్బింగ్ సినిమాగా 'కేజీఎఫ్-2' నిలిచింది. ఇప్పటిదాకా రూ.54 కోట్లతో రజినీకాంత్ నటించిన '2.O' టాప్ పొజిషన్ లో ఉండగా.. ఐదు రోజుల్లోనే 'కేజీఎఫ్-2' ఆ రికార్డుని బ్రేక్ చేయడం విశేషం.
ఐదో రోజు ఆంధ్రలో 1.9 కోట్లు, తెలంగాణలో 2.46 కోట్లు, రాయలసీమలో రూ.0.74 కోట్లను 'కేజీఎఫ్ 2' రాబట్టింది. మొత్తంగా చూస్తే.. ఐదు రోజులకు ఈ సినిమా ఆంధ్రలో 19.86 కోట్లు, తెలంగాణలో 30.63 కోట్లు, రాయలసీమలో 8.17 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో 58.66 కోట్ల షేర్(93 కోట్ల గ్రాస్) రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా ఐదో రోజు 33.34 కోట్ల షేర్(66.35 గ్రాస్) కలెక్ట్ చేసిన సినిమా ఇప్పటిదాకా ఓవరాల్ గా 311.15 కోట్ల షేర్(623.80 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఐదు రోజుల్లో కర్ణాటకలో 58.60 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 58.66 కోట్లు, తమిళనాడు 18.25 కోట్లు, కేరళ 14.20 కోట్లు, హిందీ+రెస్టాఫ్ ఇండియా 110 కోట్లు, ఓవర్సీస్ 51.40 కోట్ల షేర్ రాబట్టింది.
![]() |
![]() |