![]() |
![]() |

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఏషియన్ థియేటర్స్ అధినేత అయిన నారంగ్ నిర్మాత గా, డిస్ట్రిబ్యూటర్ గా, మూవీ ఫైనాన్షియర్ గా సిని పరిశ్రమకు సేవలందించారు. 2019 లో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు గా నారంగ్ ఎన్నికయ్యారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై 'లవ్ స్టోరి', 'లక్ష్య' వంటి సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో 'ఘోస్ట్', ధనుష్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు.
నారాయణ్‌దాస్ లేరన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |