Home

»

Latest News

షారూక్ `కోయ్ లా`కి పాతికేళ్ళు!

Apr 18, 2022 4:46PM

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో స్టార్ కెప్టెన్ రాకేశ్ రోష‌న్ ఒక‌రు. `కింగ్ అంకుల్` (1993), `క‌ర‌ణ్ అర్జున్` (1995) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూడో, ఆఖ‌రి చిత్రం `కోయ్ లా` (1997). గ‌త రెండు సినిమాల్లో మ‌రో క‌థానాయ‌కుడితో షారూక్ స్క్రీన్ షేర్ చేసుకోగా.. ఇందులో మాత్రం సోలో హీరోగా ఎంట‌ర్టైన్ చేశారు. షారూక్ ఖాన్ కి జోడీగా అందాల తార మాధురీ దీక్షిత్ న‌టించ‌గా అమ్రిష్ పురి, ర‌ణ్ జీత్, స‌లీమ్ గౌస్, సురేశ్ ఛ‌త్వాల్, హిమాని శివ‌పురి, వికాస్ ఆనంద్, ప్ర‌దీప్ రావ‌త్, జానీ లీవ‌ర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. రాకేశ్ రోష‌న్ క‌థ‌ను అందించిన ఈ చిత్రానికి ర‌వి కపూర్, స‌చిన్ బౌమిక్ స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చారు. అన్వ‌ర్ ఖాన్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు.

రాజేశ్ రోష‌న్ సంగీత‌మందించిన ఈ చిత్రంలో ``దేఖా తుఝే తో`` అంటూ సాగే పాట‌ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా.. ``త‌న్హై త‌న్హై``, ``బ‌ద‌న్ జుదా హోతే హై``,  ``భాంగ్ కే న‌షే మే``, ``ఘుంగ్తే మే చాంద్ హై`` గీతాలు కూడా రంజింప‌జేశాయి. రాకేశ్ రోష‌న్ స్వ‌యంగా నిర్మించిన `కోయ్ లా`.. 1997 ఏప్రిల్ 18న విడుద‌లై ఆ యేటి మేటి గ్రాస‌ర్స్ లో ఒక‌టిగా నిలిచింది. నేటితో `కోయ్ లా` పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com