Home  »  News  »  వరల్డ్‌ రికార్డ్‌ టార్గెట్‌గా వర్మ దర్శకత్వంలో సినిమా

Updated : Apr 17, 2022

యశ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై యశ్‌రాజ్‌ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'నీకు నాకు రాసుంటే'. 'గణా' చిత్ర డైరెక్టర్‌ కె.ఎస్‌. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వర్, సాయివిక్రాంత్, రిషి, సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్రవంతి పలగని, అభిషేక్‌ ఆవల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సాంగ్‌ రికార్డింగ్‌ మరియు బ్యానర్‌ లాంచింగ్‌ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. 

ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ.. :తెలుగులో యశ్‌రాజ్‌ పేరుతో బ్యానర్‌ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్‌ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు. 

దర్శకుడు కె.ఎస్‌.వర్మ మాట్లాడుతూ.. "తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు పనిచేస్తున్నారు. ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్ ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్‌ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా సినిమాలో జాతీయ అవార్డు పొందిన ఓ ప్రముఖ హీరోయిన్‌ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.. ఇందుకు చర్చలు జరుగుతున్నాయి" అన్నారు.

నిర్మాతలు స్రవంతి పలగని, అభిషేక్‌ ఆవల మాట్లాడుతూ.. "భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్‌ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టడం జరిగింది. యశ్‌ రాజ్‌ అనేది మా అబ్బాయి పేరు కూడా కావడం మాకు లక్కీ. 2020లోనే సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ సరైన కథలు దొరకలేదు. మా దర్శకుడు వర్మ గారు చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా సెట్స్‌కు మీదకు తీసుకెళ్తున్నాం. స్టోరీ బలంగా ఉందన్న నమ్మకంతో కొత్త వారితో వెళుతున్నాం. టాలెంటెడ్‌ టెక్నీషియన్స్ ను ఎంచుకున్నాం అన్నారు. ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం.. అన్ని సినిమాల్లో కొత్తవారికి అవకాశాలు ఇస్తాం. మే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి, హైదరాబాద్, అరకు, వైజాగ్, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతాం" అన్నారు. 

సత్యరాజ్, సుమన్, అలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి, ఉత్తేజ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.