![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందు 'నాటు నాటు' సాంగ్ ఎంత హిట్ అయిందో.. సినిమా విడుదల తర్వాత 'కొమురం భీముడో', 'కొమ్మ ఉయ్యాలా' సాంగ్స్ అంతకుమించి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. ఈ సాంగ్స్ ఫుల్ వీడియోస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కొమ్మ ఉయ్యాల' వీడియో సాంగ్ ని విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్.
'కొమ్మ ఉయ్యాల' వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా మల్లి పాటతో మొదలై, మల్లిని భీమ్(తారక్) తన తల్లి దగ్గరకు చేర్చడంతో ముగుస్తుంది. తాజాగా విడుదలైన 'కొమ్మ ఉయ్యాల' వీడియో సాంగ్ కూడా అలాగే మొదలై, అలాగే ముగియ్యడం విశేషం. స్టార్టింగ్ లో గవర్నర్ స్కాట్ వైఫ్ చేతికి టాటూ వేస్తూ మల్లి పాట పాడుతుంది. ఆ తర్వాత బ్రిటిష్ బంగ్లాలోకి మల్లిని తీసుకెళ్లడం, అక్కడ తన తల్లికి దూరమై మల్లి బాధపడుతుండటం చూపించారు. ఇక చివరిలో భీమ్ మల్లిని ఆమె తల్లి దగ్గరకు చేర్చడం వీడియో సాంగ్ లో చూడొచ్చు.
కీరవాణి సంగీతం అందించిన 'కొమ్మ ఉయ్యాల' సాంగ్ కి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ని ప్రకృతి రెడ్డి ఆలపించింది.
![]() |
![]() |