![]() |
![]() |

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లగా మారిపోయారు. ఇప్పుడు యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల బాట పడుతున్నారు. ఇప్పటికే అడివి శేష్ 'మేజర్', అక్కినేని అఖిల్ 'ఏజెంట్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ కూడా పాన్ ఇండియా సినిమాకి సై అంటున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి 'స్పై' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈడీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న 'స్పై' సినిమాకి గ్యారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తాజాగా విడుదల చేశారు. పోస్టర్ లో నిఖిల్ చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు నిఖిల్ 'కార్తికేయ-2', '18 పేజీస్' సినిమాలలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొత్తానికి ఈ ఏడాది నిఖిల్ మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
![]() |
![]() |