![]() |
![]() |

ఇటీవల హైదరాబాద్ లో పలువురు సినీ సెలబ్రిటీల కార్లకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కారుకి కూడా ఫైన్ వేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభాస్ పీఆర్ టీమ్ ఖండించింది.
ప్రభాస్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1450 ఫైన్ వేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ పీఆర్ టీమ్ స్పందించింది. "ఈ రోజు హైద్రాబాద్ రోడ్ నెంబర్ 36 లో ప్రభాస్ గారి కార్ కి హైద్రాబాద్ పోలీస్ వారు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కార్ కి, ప్రభాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదని తెలియచేస్తున్నాం. దయచేసి గమనించగలరు." అంటూ ఓ నోట్ విడుదల చేసింది.
కాగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, త్రివిక్రమ్, నాగ చైతన్య ఇలా పలువురి సెలెబ్రిటీల కార్లకి ఉన్న బ్లాక్ ఫిల్మ్ లని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.
![]() |
![]() |