![]() |
![]() |

మెగా అభిమానులకు మెగా ట్రీట్ రాబోతుంది. 'ఆచార్య' సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చిందేసిన 'భలే భలే బంజారా' సాంగ్ ఈ నెల 18 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో చిరంజీవి, చరణ్ ఛాలెంజ్ చేసుకోవడం విశేషం.
'భలే భలే బంజారా' సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియోని తాజాగా విడుదల చేశారు. అందులో డైరెక్టర్ కొరటాల శివతో చిరంజీవి, చరణ్ సంభాషించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల తారక్ తో కలిసి 'నాటు నాటు' సాంగ్ లో చరణ్ అదరగొట్టాడని, ఇప్పుడు చరణ్ తో సమానంగా చేయగలనా అని అనిపించింది అంటూ చెప్పాడు. దీంతో వెంటనే చరణ్ అందుకొని 'ఆయన గ్రేస్ ముందు మేం సరిపోతామా' అని అన్నాడు.
ఆ తర్వాత ఈ సాంగ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారని కొరటాల తెలిపాడు. ఇక చివరిలో చిరంజీవి, చరణ్ ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. 'నన్నే డామినేట్ చేయాలి అనుకుంటున్నావా.. ఇక్కనుంది నీ బాబురా' అని చిరంజీవి అనడంతో.. 'డామినేట్ చేయను.. అలా అని తగ్గను కూడా.. మీకు పోటీగా చేస్తాను' అని చరణ్ అన్నాడు. సరే చూద్దాం అంటూ చిరంజీవి ఛాలెంజ్ చేయడంతో చరణ్ కూడా సై అన్నాడు.

మొత్తానికి తండ్రి కొడుకులు పోటాపోటీగా చేసే డ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అనే చెప్పొచ్చు. గతంలో 'ఖైదీ నెం.150' సినిమాలో చిరంజీవి, చరణ్ కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఫుల్ సాంగ్ లో కలిసి డ్యాన్స్ చేయడం ఇదే మొదటసారి. రీసెంట్ విడుదలైన ట్రైలర్ లో చిరంజీవి, చరణ్ కలిసి డ్యాన్స్ చేసిన క్లిప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్స్ మోతమోగిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |