![]() |
![]() |

యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫిల్మ్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' దెబ్బకు విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్' కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మిశ్రమ సమీక్షలతో విడుదలైన 'బీస్ట్' మూవీ రెండు రోజుల్లో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. మూడో రోజు వచ్చిన రూ. 30 కోట్లతో ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు రూ. 127 కోట్ల గ్రాస్‌కు చేరుకున్నాయి.
అయితే తమిళనాడులో మూడో రోజు ఏ థియేటర్‌లోనూ ఏ షో కూడా హౌస్‌ఫుల్ కాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరో వైపు 'కేజీఎఫ్ చాప్టర్ 2' టికెట్లు అనేక థియేటర్లలో పూర్తిగా అమ్ముడుపోయాయి. నార్త్ అమెరికా, యూకేలలో మాత్రం ఆడియెన్స్ 'బీస్ట్'ను ఆదరిస్తున్నారు.
ఒక షాపింగ్ మాల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా 'బీస్ట్'ను రూపొందించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్. ఈ మూవీలో 'రా' ఆఫీసర్ వీరరాఘవగా విజయ్ నటించాడు. అతని జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ మూవీలో సెల్వరాఘవన్, షైన్ టామ్ చాకో, యోగిబాబు, వీటీవీ గణేశ్, రెడిన్ కింగ్‌స్లే సపోర్టింగ్ రోల్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
![]() |
![]() |