![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమాల్లో.. సింహభాగం మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో `యువరాజు` ఒకటి. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని వైవీయస్ చౌదరి డైరెక్ట్ చేయగా.. ఇందులో మహేశ్ కి జంటగా సిమ్రాన్, సాక్షి శివానంద్ నటించారు. వెంకట్, శివాజీ, మున్ మున్ సేన్, అలీ, వేణు మాధవ్, చంద్రమోహన్, బండ్ల గణేశ్, వర్ష, రమ్యశ్రీ, మాస్టర్ తేజ, బేబి శ్రీదివ్య ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. ఎవర్నైనా ప్రేమిస్తే.. ఆ విషయం ప్రేమించినవారికి వ్యక్తపరచాలనే పాయింట్ తో `యువరాజు` తెరకెక్కింది.
వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలు వారిన పాటలకు రమణ గోగుల వినసొంపైన బాణీలు అందించారు. ``తొలివలపే తీయనిది``, ``నూకలిస్తే``, ``మనసేమో చెప్పిన మాటే వినదు``, ``రామచిలకా``, ``గుంతలకిడి``, ``హాయిరే హాయిరబ్బా``, ``ఓలమ్మో``, ``చందమామ``, ``ట్వింకిల్ ట్వింకిల్`` (బిట్ సాంగ్).. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన `యువరాజు`.. 2000 ఏప్రిల్ 14న విడుదలై మ్యూజికల్ గా మెప్పించింది. నేటితో ఈ చిత్రం 22 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |