![]() |
![]() |

'బాహుబలి'తో ప్రభాస్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 'సాహో' సినిమాతో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్.. 'రాధేశ్యామ్'తో నిరాశపరిచాడు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.
రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓం రౌత్ తన హీరో ప్రభాస్ ని ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని, అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నాడు.
సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే ప్రభాస్ లాంటి స్టార్ తో వర్క్ చేయాలని ప్రతి ఫిల్మ్ మేకర్ కోరుకుంటాడని ఓం రౌత్ అభిప్రాయపడ్డాడు. వెండితెరపై మ్యాజిక్ చేసే అతని ప్రతిభని ఉపయోగించుకోవాలని ఫిల్మ్ మేకర్స్ అనుకుంటారని తెలిపాడు. గుండెలోని భావాలను కళ్ళలో పలికిస్తాడని కొనియాడాడు.
ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని ఓం రౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.#Prabhas, #Adipurush ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' లో రాఘవగా ప్రభాస్ దర్శనమివ్వనుండగా.. జానకిగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
![]() |
![]() |