![]() |
![]() |
.webp)
ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా షేర్, 1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' జోరు తగ్గుతూ వస్తోంది. మొదటి 17 రోజుల్లో రెండు రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్.. 18 వ రోజు కోటి షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వేట దాదాపు ముగిసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 18వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 0.81 కోట్ల షేర్(1.30 కోట్ల గ్రాస్) రాబట్టిన ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా 4.18కోట్ల షేర్(10.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వరల్డ్ వైడ్ గా ఒక్కరోజులో 5 కోట్ల కంటే తక్కువ షేర్ రాబట్టడం ఇదే మొదటిసారి. ఈరోజు నుంచి కలెక్షన్స్ మరింత డ్రాప్ అయ్యే అవకాశముందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 18 రోజుల్లో 259.13 కోట్ల షేర్(390.65 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 18 రోజుల్లో 107.84 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 49.16 కోట్లు రాబట్టి 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 102.13 కోట్లు కలెక్ట్ చేసింది.
18 రోజుల్లో ఓవర్సీస్ లో 95.30 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 116.45 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 41.90 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 36.95 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 10.22 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 8.65 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) షేర్ రాబట్టి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది.
వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ ఆర్ఆర్ఆర్ 18 రోజుల్లో 568.60 కోట్ల షేర్(1039.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా బయ్యర్లకు 115 కోట్లకు పైగా లాభం తెచ్చిపెట్టింది. అయితే ఇక ఈ సినిమా హవాకి ఎండ్ కార్డు పడొచ్చు. ఈ నెల 13 న 'బీస్ట్' విడుదల ఉంది. దీంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ మరింత అయ్యే అవకాశముంది. అలాగే 14 న 'కేజీఎఫ్-2' విడుదల కానుంది. దీంతో కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ కలెక్షన్స్ పైనా తీవ్ర ప్రభావం పడనుంది. అదే జరిగితే 600 కోట్ల షేర్, 1100 కోట్ల గ్రాస్ టార్గెట్ ఆర్ఆర్ఆర్ అందుకోవడం కష్టమే.
![]() |
![]() |