![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఏప్రిల్ 14న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజవుతోంది. సంజయ్ దత్ విలన్‌గా నటించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అంచనాలు అమోఘం. హిందీ బెల్ట్‌లోనూ ఈ సినిమా కోసం ఆడియెన్స్ అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తున్నారనేందుకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సేల్ అవుతున్న టికెట్ల సంఖ్యే నిదర్శనం.
రిలీజ్ డేట్ దగ్గరపడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఆదివారం ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన యశ్, తెలుగు ప్రేక్షకులు తన మీదా, తన సినిమా మీదా చూపిస్తున్న ఆదరణను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
"కర్నాటక, ఆంధ్ర అనుబంధం ప్రత్యేకమైంది. మన కల్చర్ ఒకటే. భాషలు కూడా చూడ్డానికి ఒకే తరహాలో కనిపిస్తాయి. లిపి ఒకేలాగా ఉంటుంది. తెలుగుని కన్నడిగులు చదవగలుగుతారు. తెలుగువాళ్లు మమ్మల్ని పెద్ద స్థాయిలో రిసీవ్ చేసుకున్నారు. 'కేజీఎఫ్' కంటే ముందుగానే నా పలు సినిమాలను తెలుగువాళ్లు ఆదరించారు. ప్రత్యేకించి బోర్డర్ ఏరియాలోని వాళ్లు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేశారు. ఎందుకో నాకూ తెలీదు. ఇంత అభిమానంతో, ఇంత ప్రేమతో తెలుగు ప్రేక్షకులు అందరూ రిసీవ్ చేసుకున్నందుకు థాంక్స్ చెప్తున్నా." అని యశ్ అన్నాడు.
తన తెలుగులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, మన్నించమని కోరిన అతను, "ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని తెలుగు మాట్లాడే వారందరూ మమ్మల్ని ఇలాగే ఆదరించండి. ఐ లవ్ యూ. ఓవర్సీస్‌లోనూ మీరిచ్చిన సపోర్ట్, కలెక్షన్స్ చూసి ఏంటిది అని నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నా మీద బాధ్యత పెంచింది. వాళ్లు బెస్ట్ ఆడియెన్స్ అని చెప్పవచ్చు. సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్లకు బాగా తెలుసు" అని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |