![]() |
![]() |

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లెఫ్ట్‌నెంట్ రామ్ గా దుల్కర్ కనిపించనున్నాడు. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ' అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు.
రామ్ గా దుల్కర్, సీతగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ సినిమాకి 'సీతా రామం' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీలో అఫ్రీన్ అనే ముస్లిం యువతి పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు. "ఇది ఒక సైనికుడు శత్రువుకి అప్పగించిన యుద్ధం అఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములను నువ్వే గెలిపించాలి." అనే వాయిస్ తో రష్మిక, మృణాల్, దుల్కర్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషలతో పాటు తమిళ్ లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |